ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు కూడా వాళ్లకి నచ్చిన పథకాల్లో డబ్బులని పెడుతున్నారు. మంచిగా డబ్బులని పొందుతున్నారు. సంపాదన ఎంత ఉన్నా నెలకు ఎంతో కొంత పొదుపు చెయ్యడం మంచిది. పొదుపు చెయ్యకపోతే వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చై పోతాయి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను తీసుకు వచ్చింది.
వాటిలో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు చూసేద్దాం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు సామాజిక భద్రత కల్పించాలని ఈ స్కీమ్ ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. భారత ప్రభుత్వం 2017లో దీన్ని ప్రవేశ పెట్టింది. భవిష్యత్తులో వడ్డీ ఆదాయం తగ్గడం వృద్ధులపై ప్రభావం పడకుండా భద్రత ఉంటుంది.
ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ అర్హత వివరాలు:
గరిష్టంగా రూ.15 లక్షల వరకు వయ వందన యోజన స్కీమ్ లో చేరచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఈ స్కీమ్ బాధ్యతల ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC తీసుకుంటోంది. ఇప్పుడు ఈ స్కీమ్ కి మార్చి 31, 2023 వరకు మాత్రమే అందుబాటులో వుంది. చాలా బ్యాంకులు పదేళ్ల కాల పరిమితి లోని ఎఫ్‌డీల పై దాదాపు 6.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.
వయ వందన యోజన స్కీమ్ తో ఎంత వస్తాయి..?
ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. మీరు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. రూ. 1000 నెల వారీ పెన్షన్ మరియు గరిష్టంగా రూ. 9250 నెలవారీ పెన్షన్ ని ఈ స్కీమ్ తో పొందొచ్చు. భార్యా భర్తలిద్దరూ కలిసి రూ.15 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టారు అంటే అప్పుడు రూ.18,500 వరకు పొందవచ్చు. ఎంత వస్తుంది అనేది పెట్టుబడి ని బట్టీ ఉంటుంది.