BREAKING : బండి సంజయ్‌కి మరోసారి సిట్ నోటీసులు !

-

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓవైపు అభ్యర్థుల భవితవ్యం గందరగోళంలో పడిపోతుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇంకోవైపు సిట్.. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి ఈ కేసులో కీలక విషయాలు సేకరించింది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ఎన్ ఐ ఆర్ లకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఇది ఇలా ఉండగా.. ఈ కేసులో బండి సంజయ్‌కి మరోసారి నోటీసులు ఇవ్వనుంది సిట్. పేపర్ లీకేజీపై ఆధారాలివ్వాలని గతంలోనే నోటీసులు ఇచ్చిన సిట్.. 24న హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటుంది. ఇక ఈ తరుణంలోనే.. బండి సంజయ్‌కి మరోసారి నోటీసులు ఇవ్వనుంది సిట్.

Read more RELATED
Recommended to you

Latest news