ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కస్టమర్స్ గుడ్ న్యూస్ ను చెప్పింది..ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఫాలో అవుతూ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..ఇప్పుడు మరో గుడ్ న్యూసును చెప్పింది..ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ లేకుండా కేవలం మిస్డ్‌కాల్ లేదా మెసేజ్‌ల ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది SBI..
కస్టమర్లకు ఎస్‌బీఐ క్విక్ యాప్ ద్వారా అనేక మొబైల్ సేవలను ఉచితంగా అందిస్తోంది. మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సాయంతో అకౌంట్ బ్యాలెన్స్, మినీ-స్టేట్‌మెంట్ పొందవచ్చు. లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి నిర్దిష్ట మొబైల్ నంబర్లకు ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉపయోగించి SMS పంపించి కూడా వివిధ సేవలను పొందవచ్చు. ఎస్‌బీఐ కస్టమర్‌లు ఫోన్‌లో ఉచితంగా పొందగలిగే సేవలు ఏంటో ఒకసారి చూడండి..
*.6 నెలల ఎస్‌బీఐ ఇ-స్టేట్‌మెంట్ : మెసేజ్ ద్వారా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 6 నెలల ఇ-స్టేట్‌మెంట్ పాస్‌వర్డ్ ఎన్‌క్రిప్టెడ్ PDF ఫైల్ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి వస్తుంది. ఇందుకు 917208933145 నంబర్‌కు ‘ESTMT <అకౌంట్ నంబర్> అని మెసేజ్ పంపాలి..
*. ఎస్బిఐ మినీ స్టేట్మెంట్ :తాజాగా నిర్వహించిన ఐదు ట్రాన్సాక్షన్‌ల మినీ స్టేట్‌మెంట్ కోసం ఎస్‌బీఐ కస్టమర్ 919223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఇదే నంబర్‌కు ‘MSTMT’ అని SMS పంపవచ్చు..
*.ఎస్‌బీఐ బ్యాలెన్స్ ఎంక్వైరీ : అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కస్టమర్లు 919223766666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు లేదా ఇదే నంబర్‌కు ‘BAL’ అని SMS చెయ్యాలి..
*.ఎస్‌బీఐ చెక్ బుక్ రిక్వెస్ట్ అక్నాలడ్జ్‌మెంట్ : ఈ సేవలు పొందేందుకు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుంచి 917208933145 నంబర్‌కు “CHQREQ” అని మెసేజ్ చెయ్యాలి..
*.హోమ్ లోన్ ఇంట్రస్ట్ సర్టిఫికేట్ : ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హోమ్ లోన్ ఇంట్రస్ట్ సర్టిఫికేట్‌ను కూడా చెక్ చేయవచ్చు. ఇందుకు 917208933145 నంబర్‌కు HLI <అకౌంట్ నంబర్> అని SMS సెండ్ చేయాలి..
*.ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ : ఫోన్ మెసేజ్ ద్వారా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్‌ని చెక్ చేయవచ్చు. 917208933145 నంబర్‌కు ELI <అకౌంట్ నంబర్> అని మెసేజ్ చేయాలి..
*.ఎస్‌బీఐ సర్వీసెస్ లిస్ట్ : మెసేజ్ ద్వారా ఎస్‌బీఐ అందిస్తున్న సర్వీసెస్ లిస్ట్‌ను అందుకోవచ్చు. 917208933145 నంబర్‌కి HELP అని మెసేజ్ పంపాలి..
*.లాంగ్వేజ్ ఛేంజ్(హిందీ/ఇంగ్లీష్) : లాంగ్వేజ్ ఛేంజ్ చేయడానికి (హిందీ/ఇంగ్లీష్).. అవసరమైన లాంగ్వేజ్ పేరు టైప్ చేసి 917208933148కి టెక్స్ట్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
*. ఎస్‌బీఐ ఎన్రోల్ పాజిటివ్ పే సిస్టమ్ : ఎన్రోల్ పాజిటివ్ పే సిస్టమ్ని ఉపయోగించే ముందు ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
*.ఎస్‌బీఐ చెక్ బుక్ రిక్వెస్ట్ : చెక్ బుక్ కోసం 917208933145 నంబర్‌కు “CHQREQ” అని టైప్ చేసి SMS సెండ్ చేయాలి.. ఇవే కాదు మరెన్నో సేవలను బ్యాంకు అందిస్తుంది..