ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉమర్ సంధు.. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఫిలిం క్రిటిక్ గా చెప్పుకొనే ఉమర్ సందు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ హీరో హీరోయిన్లను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురుపై వైరల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే తాజాగా ఓ స్టార్ కిడ్ నో టార్గెట్ చేయడమే కాకుండా అతని గేమ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ గా మారుతుంది ఇందులో కొన్ని విషయాలు మాత్రం వైరల్ గా మారిపోతాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకునే ఓ వ్యక్తి బాలీవుడ్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా వీరిపై సంచలనం వ్యాఖ్యలు చేసి వివాదాలకు తెరతీస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ‘గే’ అంటూ ట్వీట్ చేశాడు.
BREAKING NEWS: #SaifAliKhan’s son #ibrahimAliKhan came out as “ Gay ”. OMG ! What happened to Star Kids, mostly came out as Homosexual. pic.twitter.com/BV7O6nVex3
— Umair Sandhu (@UmairSandu) March 28, 2023
ట్విట్టర్ వేదికగా.. “బ్రేకింగ్ న్యూస్: సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ గే.. గా బయటపడ్డాడు.. ఓరి దేవుడా! స్టార్ కిడ్స్‌కి ఏమి జరిగింది.. ఎందుకు వీళ్లంత స్వలింగ సంపర్కుడిగా మారిపోతున్నారు.. అంటూ కాప్షన్ ఇచ్చి పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారగా పలువురు ఉమర్ సందును దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా స్టార్స్ ని టార్గెట్ చేసి వారిపై విమర్శలు చేసే వివాదాలకు తెర తీయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ మండిపడుతున్నారు.