వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఉపాసన – రాంచరణ్.. ఫొటోస్ వైరల్..!

-

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మార్చి 27వ తేదీన ఆయన బర్త్డే సందర్భంగా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఇక ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు మెగా ఫ్యామిలీతో పాటు సినీ ప్రముఖులు, ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.

అంతే కాదు ఈ వేడుకల్లో రామ్ చరణ్ భార్య ఉపాసన మొదటిసారి బేబీ బంప్ లో కనిపించింది. త్వరలోనే వీరిద్దరూ దంపతులు కాబోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆగస్టులో ఆమె డెలివరీ డేట్ కూడా ప్రకటించారు. ఇకపోతే బర్తడే వేడుకలు అలా కంప్లీట్ అయ్యాయో లేదో ఇలా దంపతులిద్దరూ దుబాయిలో ప్రత్యక్షమయ్యారు. వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఉపాసన తన ఇన్ స్టా స్టోరీ లో పోస్ట్ చేసింది.

అంతేకాదు ప్రైవేట్ జెట్ లో దుబాయ్ వెళ్తున్న ఒక వీడియోని కూడా ఆమె పంచుకుంది. విమానంలో రామ్ చరణ్ తన పెంపుడు కుక్కను కూర్చోబెట్టుకొని ఉన్న ఫోటో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మొత్తానికి అయితే ఈ జంట ఇప్పుడు వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. మరొకవైపు ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ఆమె ఇలా ప్రయాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రాంచరణ్ కూడా భార్యతో పాటే మరిన్ని అనుభూతులు పంచుకోవడానికి ఇలా వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news