తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

-

తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగిందని ప్రకటించారు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందని… ఇవాళ ఉదయం 11.01 నిమిషాలకు 15497 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగం అయిందన్నారు.

మార్చి నెల ఆరంభం నుండే 15000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అవుతుంది… ఎండలు ఎక్కువ కావడం,వ్యవసాయ రంగం కు కరెంట్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం జరిగిందని చెప్పారు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. సాగు విస్తీర్ణం పెరగడం,రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని చెప్పారు.

మొత్తం విద్యుత్ వినియోగం లో 37 శాతం వ్యవసాయ రంగంకేనని..దేశంలో వ్యవసాయ రంగం కు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి ఈనెలలోనే 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి ఇవాళ 15497 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయిందన్నారు ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news