“డెవిల్” షూటింగ్ లో కళ్యాణ్ రామ్ కి గాయాలు?

-

కొందరు హీరోలకు షూటింగ్ లలో గాయాలు తగలడం మామూలు విషయం. వాళ్లకు యాక్సిడెంట్ అయింది అంటే అభిమానులు కూడా కంగారు పడడం మానేశారు. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో గాయాలు తగలడం కామన్. గాయాలను సైతం లెక్కచేయకుండా అప్పటివరకు చేయని రిస్కీ స్టంట్స్ హీరోలు చేసేస్తారు. అయితే తాజాగా డెవిల్ మూవీ షూటింగ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ గాయపడినట్లు తెలుస్తోంది.

ఆయన నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో ఓ ఫైట్ సీన్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ కి ప్రమాదం జరగగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news