రెండు రోజుల క్రితం కడప జిల్లాలోని పులివెందులలో కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో దిలీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. కాల్పులు జరిపిన భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మరుసటి రోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని వెల్లడించాడు. అనంతరం నిండితుడి నుండి తుపాకీ, రెండు తూటాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మృతుడు దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నేడు భరత్ కుమార్ యాదవ్ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో భరత్ కుమార్ యాదవ్ కు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు భరత్ కుమార్ యాదవ్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక మరోవైపు ఇదే ఘటనలో గాయాల పాలైన మహబూబ్ బాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.