అగ్ని ప్రమాదాలపై తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అగ్నిమాపక శాఖలో మొత్తం 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి.. అసెంబ్లీ కానిస్టెన్సీ కి ఒక అగ్నిమాపక వాహనం ఉంటుందని వివరించారు. ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ పని చేస్తుంది.. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సమయంలోనే ఫైర్ నిబంధనలు ఉంచుకోవాలని కోరారు. మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నపుడు ఎలాంటి ఫైర్ సేఫ్టీ పెట్టుకోవాలి అనేది భవన నిర్మాణ నిబంధనల్లొ స్పష్టం చేయబడుతుందని.. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టుకుని దాన్ని సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని కోరారు.
అగ్నిమాపక శాఖ పనితీరు వేగంగా జరగాలి అంటే ఘటన జరిగిన వెంటనే సమాచారం త్వరగా అందంచాలని… నగరంలో భవన సముదాయలపై ఫైర్ ఆడిట్ ను కొనసాగిస్తూనే ఉన్నాం. ఇది నిరంతరాయంగా సాగే ప్రక్రియ అని తెలిపారు. అగ్నిమాపక శాఖ, ghmc అనుమతులు ఇచ్చిన అనంతరం భవన యజమానులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో 34 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి.ప్రస్తుతానికి జనాభాకు అనుగుణంగానే అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి.. అగ్నిప్రమాదాలపై గత సంవత్సరం దాదాపు 8000 కాల్స్ వచ్చాయన్నారు తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి.