బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాల్సి ఉండడంతో ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు షకీబ్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఐర్లాండ్ తో మార్చి 31న టీ20 సిరీస్ ముగిసిన తర్వాత షకీబ్ తమ జట్టుతో కలుస్తాడని కేకేఆర్ యాజమాన్యం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.
అయితే మంగళవారం నుంచి ఐర్లాండ్ తో బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఆడనుండగా, మే 9-14 మధ్య కెమ్స్ ఫోర్డ్ లో మూడు వన్డేల్లో బంగ్లా, ఐర్లాండ్ తలపడతాయి. ఇదే కారణంతో మరో బంగ్లా ఆటగాడు కేకేఆర్ సభ్యుడే అయిన లిటన్ దాస్ కూడా ఐపీఎల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వేలం సమయంలో తమ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో కాకపోయినా, కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటారని బంగ్లా బోర్డు ప్రకటించగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షకీబ్ దూరమైతే కోల్కత్తా టీం లో ఆరుగురు విదేశీ ఆటగాళ్ళే ఉంటారు. ఇక ఐపీఎల్-2023 లో పంజాబ్ తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. ఐపీఎల్ కు ముందు.. ఆయా ప్లేయర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కురిపించాయి. కానీ మధ్యలో వెళ్లిపోతే.. ఆ డబ్బులు ఫ్రాంచైజీలే భరించాల్సి ఉంటుంది. దీంతో ప్లేయర్లకు లాభం చేకూరుతుంది.