BRS అంటే.. బలత్కారిస్ట్స్.. రేపిస్ట్స్.. సెక్సువల్ వేధింపుదారులు : బండి సంజయ్

-

బీఆర్ఎస్ పార్టీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. BRS అంటే బలత్కారిస్ట్స్.. రేపిస్ట్స్.. సెక్చువల్ అబ్యూసర్స్ పార్టీ అని అభివర్ణించారు. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లపై ట్విటర్ వేదికగా బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ట్విటర్ టిల్లు(కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ) వేదికను పంచుకున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. గవర్నర్‌ను దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టారని అన్నారు. మహిళా సర్పంచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ ఆరోగ్య మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గతంలో వేదిక పంచుకున్న వారేనని చెప్పారు. ముగ్గురు ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారునికి ఆత్మీయ సమ్మేళనంలో ఘనంగా సన్మానించారని మండిపడ్డారు.

మంగళవారం మరదలు అని.. ఓ మహిళను వ్యాఖ్యానించిన వ్యక్తి ఇంకా మంత్రి పదవిలో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ బీఆర్ఎస్ మంత్రిని ఏకంగా సీఎం ప్రశంసించారని ఆరోపించారు. బీజేపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో దుర్భాషలాడిన బీఆర్ఎస్ అనుచరులను అరెస్ట్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. నాయకుల మాదిరే అనుచరులు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news