సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఇలాంటి బెదిరింపులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ కి ఇలాంటి బెదిరింపులు రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.. ఎవరో ఆయనను బెదిరిస్తూ రెండు లేఖలు పంపారు.. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ప్రైవేటు వీడియోలను పబ్లిక్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుదీప్ కు రాసిన లేఖలో అసభ్య పదజాలం కూడా వాడినట్లు సమాచారం. అయితే ఈ లెటర్స్ సుదీప్ ఇంట్లో పని చేస్తున్న కేర్ టేకర్ కి అందగా.. ఎవరో సుదీప్ పలుకుబడికి, ప్రతిష్టకి భంగం కలిగించడానికి ఇలా కుట్ర పన్నుతున్నారు అంటూ సుదీప్ కుటుంబ సభ్యులు మంజునాథ్ ఆరోపిస్తున్నారు.
అయితే ఎవరో కావాలని చేస్తున్న ఈ పనికి సుదీప్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై పుట్టెనహళ్లి పోలీసులు సెక్షన్ 506 ( నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 504 ( ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేసి నిందితులకు ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాదు ఈ కేసును సిసిబి కి బదిలీ చేయాలని సీనియర్ పోలీసు అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సుదీప్ కన్నడ సినిమాలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాలో కూడా ఆయన నటించారు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సోలో హీరోగా గత ఏడాది జులైలో విడుదలైన విక్రాంత్ రోణా లో కూడా నటించారు. తెలుగులో ఈగ , బాహుబలి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.