ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి.. సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని WHO సూచన

-

ప్రస్తుత సమాజంలో ప్రజల జీవనశైలి అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. కరోనా వల్ల కాస్త చక్కబడ్డా చాలా వరకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన అలవాట్లు లేవు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరిలో అనారోగ్యకర అలవాట్ల వల్ల సంతానలేమి కూడా కలుగుతోంది.

ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి అత్యవసరంగా సంతాన సాఫల్య చర్యలు చేపట్టాలని, అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ప్రాంతాల మధ్య వంధ్యత్వ సమస్యలో పెద్దగా తేడాలు లేవని, సంపన్న, మధ్యతరగతి, పేద దేశాల్లో ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ పేర్కొంది.

‘సంపన్న దేశాల్లో 17.8 శాతం, మధ్య తరగతి, పేద దేశాల్లో 16.5శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉంది. సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అద్నాం గేబ్రియేసస్‌ తెలిపారు. ఇంతమంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి తక్కువ వ్యయం, భద్రతతో కూడిన సంతాన సాఫల్య విధానాలను తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news