దక్షిణాది రాష్ట్రం అయిన తమిళనాడు లో ఒకప్పుడు రాజకీయాలు కేవలం జయలలిత చుట్టూనే తిరుగుతూ ఉండేవి. కానీ ఆమె మరణం అనంతరం పార్టీలో చీలికలు ఏర్పడి.. గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని డీఎంకే కు కోల్పోయారు. ప్రస్తుతం తమిళనాడు సీఎం గా స్టాలిన్ సుపరిపాలన అందిస్తూ అందరిచేత శబాష్ అనిపించుకుంటున్నాడు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఈయనను రోల్ మోడల్ గా తీసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎఈయన మరో సంచలన నిర్ణయం తీయూస్కుని అందార్తారినీ షాక్ కు గురి చేశాడు.
గత ప్రభుత్వం సమయంలో అన్నాడీఎంకే పార్టీ తరపున సీఎం గా ఉన్న పళణిస్వామి పై విచారణకు ఆర్డర్ జరీ చేశాడు. దీనికి కారణం పళణిస్వామి సీఎం గా ఉన్నపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాల కోసం కేటాయించిన బడ్జెట్ లో రూ. 4 వేల కోట్ల అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి పళణిస్వామి నిజంగానే తప్పు చేశాడా ? లేదా అన్నది తెలియాల్సి ఉంది.