EMIలో వస్తువులే కాదు.. ఆ మామిడిపండ్లను కూడా కొనేయొచ్చు..!

-

మామిడి పండ్ల సీజన్‌ వచ్చేసింది.. మన దగ్గర అయితే..మామిడిపండ్లు కాస్ట్‌ మరీ అంత ఎక్కువ ఏం ఉండదు. కానీ మామిడిపండ్లు చాలా ఖరీదు ఉంటాయి.. వాటిని తినాలని ఉంటది కానీ.. మన దగ్గర అన్ని పైసలు ఉండవు. మనకు ఆన్‌లైన్‌లో ఏం షాపింగ్‌ చేసినా, మన దగ్గర డబ్బులు లేకున్నా.. EMIలో కొంటాం.. ఇప్పుడు మామిడిపండ్లను కూడా EMIలో కొనే ఆప్షన్‌ వచ్చేసిందని మీకు తెలుసా..? అసలు ఈ కథేంటో జర చూద్దామా..!

సోనాస్ 12 సంవత్సరాలుగా మామిడి వ్యాపారంలో ఉన్నారు. దేవ్‌గడ్ హాపస్ అమ్మకంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. అల్ఫోన్సో మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు పూణేకు చెందిన ఓ పండ్ల విక్రయదారుడు ఓ వింత కాన్సప్ట్‌ను తీసుకొచ్చాడు. పండ్ల వ్యాపారి ఈఎంఐపై అల్ఫోన్సో మామిడి పండ్లను విక్రయించడం ప్రారంభించాడు.

 

పూణేకు చెందిన ఒక పండ్ల వ్యాపారి EMIలో రుచికరమైన అల్ఫోన్సోను విక్రయించడానికి ఒక ఆఫర్‌ను స్టాట్‌ చేశాడు.. దీనివల్ల మామిడిపండ్లను తినాలన్నా.. డబ్బులు లేక ఈ సీజన్‌లో మామిడిపండ్లకు దూరమయ్యేవాళ్లు.. EMIలో హ్యాపీగా మామిడిపండ్లను కొనేయోచ్చు.. అల్ఫోన్సో మామిడి ప్రియులు ఆర్థిక ఇబ్బందులను పక్కనబెట్టి పండ్ల రారాజును మనస్పూర్తిగా ఆస్వాదించాలని పూణేలోని ఆనంద్ నగర్‌లోని ‘గ్రీన్ మ్యాంగోస్’ యజమాని గౌరవ్ సనాస్ విజ్ఞప్తి చేస్తున్నారు. సునాస్ ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీకి చెందిన POS మెషీన్‌లను ఇన్‌స్టాల్ చేసింది.

ఇది క్రెడిట్ కార్డ్‌లు, కొన్ని డెబిట్ కార్డ్‌లలో కూడా బిల్లు మొత్తాన్ని 3 నుంచి 18 EMIలకు మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రీమియం మామిడి పండ్లను కొనాలనుకునే వ్యక్తులు ఎక్కువ తీసుకోవాలన్నా.. డబ్బులు లేక తక్కువగా కొనడం, లేదా ఆర్థిక కారణాల వల్ల అసలకే కొనలేకపోవడం వంటి అంశాలను గమనించానని సనాస్ తెలిపారు. దేవ్‌గడ్ హాపస్ బాక్స్ ధర దాదాపు రూ. 4,000 (డజన్‌కు రూ. 600 నుండి రూ. 1,300). ఉంది. కొనుగోలుదారు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేకపోతే… ఆ మొత్తాన్ని రూ. 700 చొప్పున 6 EMIలుగా మార్చడాన్ని ఎంచుకోవచ్చు. టెక్నాలజీ మహిమ.. చేతిలో ఫోన్‌ ఉంటే చాలు..ఏదైనా చేసేయొచ్చు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news