నేను మాట్లాడితే రాజకీయ పార్టీకి అమ్ముడుపోయానంటారు : రేణుదేశాయ్

-

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన ఇద్దరు పిల్లలతో పూణేలో ఉంటుంది. తెలుగు టెలివిజన్ రంగంలో కొన్ని డ్యాన్స్ టెలివిజన్ షో లకు జడ్జి గా వ్యవహరిస్తూ మరోపక్క సినిమాలు నిర్మిస్తూ కెరీర్ కొనసాగిస్తోంది.

ఇది ఇలా ఉండగా పెళ్లయిన నటీనటులు విడిపోతే హీరోయిన్ నే తప్పుబడతారంటూ ఓ మహిళ మాట్లాడిన వీడియోను తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తన ఇన్ స్టా స్టోరీలో పంచుకున్నారు. ఆమె ఎవరో నాకు తెలియదు.. కానీ మొదటిసారి నా తరపున మాట్లాడటం విని చాలా ఏడ్చాను. నేను ఏదైనా మాట్లాడితే రాజకీయ పార్టీకి అమ్ముడుపోయానంటారంటూ ఈ వీడియో పై రాసుకొచ్చింది రేణు దేశాయ్. ఎన్నికలు వస్తాయంటారు… ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునే వారు ఉన్నారనే ధైర్యం వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news