తెలంగాణ పంచాయతీ సెక్రటరీలకు కెసిఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. జిల్లాల వారి వివరాలను ఇవ్వాలని డిపిఓ లను ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా 2019 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9352 మంది జిపిఎస్ ల నియామకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు. దీంతో ఈనెల 28 లోగో రెగ్యులర్ చేయకపోతే సమ్ములోకి వెళ్లాలని పంచాయతీ సెక్రటరీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో వారి సమస్యలపై దృష్టి సారించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే వారి క్రమబద్దీకరణకు కేసిఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది.