భారత్ సరిహద్దులపై కన్నేస్తే ఖబడ్దార్.. చైనాకు అమిత్ షా వార్నింగ్

-

అరుణాచల్​ప్రదేశ్​పై వితండవాదం చేస్తున్న డ్రాగన్ దేశం మరోసారి అర్థంలేని వ్యాఖ్యలు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్​లో పర్యటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతం తమదే కాబట్టి.. అమిత్ షా పర్యటన తమ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.

‘జాంగ్నాన్ (అరుణాచల్​కు చైనా పెట్టిన పేరు) చైనా భూభాగం కిందకు వస్తుంది. ఈ భూభాగంలో భారత అధికార వర్గాల కార్యకలాపాలు చైనా సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. సరిహద్దులో శాంతి, సుస్థిరతలకు ఇది మంచిది కాదు. మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం’ అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ చెప్పుకొచ్చారు.

మరోవైపు సోమవారం రోజున అరుణాచల్ ​ప్రదేశ్​లో పర్యటించిన అమిత్ షా.. దుందుడుకు చైనాకు పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చనే కాలం గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. భారత సరిహద్దుల వైపు ప్రత్యర్థులెవరూ కన్నెత్తి చూడలేరని అన్నారు. భారత్​కు చెందిన అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news