సల్మాన్​ ఖాన్​తో ప్రేమాయణం.. టైం లేదంటూ పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

మొన్నటిదాకా టాలీవుడ్​లో వరుస అవకాశాలతో.. సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్లిన పూజా హెగ్డేను ఇటీవల ఫ్లాపులు చుట్టుముట్టాయి. అందుకే ఈ భామ తెలుగు తెరకు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్​లో సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బీ టౌన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది ఈ బుట్టబొమ్మ.

ఈ సినిమా షూటింగ్​ నుంచే సల్మాన్-పూజ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై పూజ స్పందిస్తూ తను సింగిల్‌ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘’దీని గురించి నేను ఏమి చెప్పాలి? రోజూ నా గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటినీ చదువుతూ ఉంటాను. కానీ వాటిని పట్టించుకోను. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. అలా ఉండటమంటేనే నాకు ఇష్టం. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌పైనే ఉంది. వేర్వేరు భాషల్లో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. అదే నా లక్ష్యం. ఇలాంటి ప్రేమ వదంతులపై స్పందించే సమయం కూడా నాకు లేదు’.’’ అని చెప్పింది

Read more RELATED
Recommended to you

Latest news