Telangana: రాష్ట్రంలో నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ

-

కరోనా మహమ్మారి ప్రపంచంపై విరుచుకు పడుతోంది. ఏడాది కాలంగా కాస్త ఊరటనిచ్చిన కోవిడ్ మళ్ళీ విజృంభిస్తోంది. భారత్ లో రోజు రోజుకు corona కేసులు పెరుగుతున్నాయి. ఈ నేథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

బూస్టర్ డోస్

కరోనా అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అపరమత్తమైంది. ఇందులో భాగంగానే మరోమారు బూస్టర్ డోస్‌ల పంపిణీకి సన్నద్ధమైంది. గత కొంత కాలంగా కోవిడ్ వ్యాక్సిన్‌ల కొరత కారణంగా బూస్టర్ డోస్‌ల పంపిణీ నిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలే స్వయంగా కోవిడ్ వ్యాక్సిన్‌లు కొనుగోలు చేయాలని ఇటీవల సూచించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ “బయోలాజికల్‌ – ఈ” నుంచి 5 లక్షల కోర్బివ్యాక్స్ డోసులు కొనుగోలు చేసిన సర్కారు.. వాటిని బూస్టర్ డోస్ కోసం అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. కోవ్యాక్సిన్‌, కోవీషీల్డ్‌ టీకాలను మొదటి, రెండు డోసులు తీసుకున్న వారికి హెటిరోలోగస్ విధానంలో మూడో డోస్‌గా కోర్బివ్యాక్స్ ఇవ్వనున్నట్టు స్ఫష్టం చేసింది. అర్హులైన వారు తప్పక టీకా తీసుకోవాలని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news