TSPSC పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పోరు.. షెడ్యూల్ ఇదే

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీక్ పై ఓ వైపు సిట్, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ TSPSC వ్యవహారంపై పోరు బాట పట్టనుంది. లీకేజీ అంశంపై ఆ పార్టీ కార్యచరణను tpcc చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈ నెల 21 నల్గొండలోని మాహాత్మాగాంధీ యూనివర్సిటీలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మే 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మైదానంలో నిర్వహించనున్న నిరుద్యోగుల భారీ బహిరంగసభకు పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీలు ఇద్దరూ విద్యార్థులను నట్టేట ముంచారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఇద్దరూ విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉన్నప్పటికి.. రద్దు చేయడం లేదని అన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో చిన్నస్థాయి ఉద్యోగుల అరెస్టుతో సిట్‌ సరిపెట్టిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news