అఖిల్ “ఏజెంట్” ట్రైలర్ అవుట్ దద్దరిల్లిపోయింది…

-

https://youtu.be/R6-D1ntd3f0

అక్కినేని అఖిల్ మరియు సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం “ఏజెంట్”.. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని పోస్టర్ లు టీజర్ లను చూస్తేనే అర్ధమవుతోంది. కిక్ మరియు రేస్ గుర్రం లాంటి చిత్రాలను అందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించడంతో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో భాగంగా కాసేపటి క్రితం కాకినాడ లో ఏజెంట్ టీమ్ ట్రైలర్ ను విడుదల చేశారు. అనుకున్న విధంగానే ట్రైలర్ అద్దిరిపోయింది అంటూ టాక్ వినిపిస్తోంది. లేట్ అయితే అయింది కానీ… మంచి కంటెంట్ ఉన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు అంటూ అఖిల్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

మరి ట్రైలర్ ను బట్టి సినిమా హిట్ అవుతుందా అంటే చెప్పడం కష్టమే.. కానీ సినిమాలో మాత్రం సబ్జెక్ట్ ఉందనిపిస్తోంది అంటూ సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్ లలో విడుదల కానుంది. పలుమార్లు ఈ సినిమా షూటింగ్ ను జరుపుకోవడంతో అభిమానులు సందేహపడ్డారు. కానీ లేట్ అయినా అద్భుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news