చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లదాడి – ఏపీ బీజేపీ కీలక వ్యాఖ్యలు

-

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై రాళ్లదాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఫైర్ అయ్యారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మంత్రి హోదాలో బట్టలు విప్పి సవాల్ విసరడం సిగ్గుచేటు అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. మీరు బట్టలు విప్పడం కాదు., 2024లో ప్రజలే మీ బట్టలు విప్పి పరిస్థితి వస్తుందన్నారు. 2024 లో నూటికి నూరు శాతం వైసీపీ ఓటమి ఖాయం అని తెలిపారు.

సీఎం మెప్పు పొందడానికే మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారని.. ఈ రోజు మంత్రి షర్ట్ విప్పితే, రేపు ఇంకో మంత్రి ప్యాంటు విప్పుతాడు, మరోసారి ఇంకో మంత్రి బట్టలన్నీ విప్పుతాడన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందో చెప్పాలంటే నేనే ఉదాహరణ అని.. ఒకప్పుడు రోలెక్స్ వాచి వాడేవాడిని.. ఇప్పుడు నార్మల్ వాచి స్థాయికి దిగిపోయానని వెల్లడించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news