ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు ముంబై ఆడిన 7 మ్యాచ్ లలో కేవలం మూడింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. కాగా నిన్న గుజరాత్ జరిగిన మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. త్వరలోనే ఆస్ట్రేలియా తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయానికి రోహిత్ శర్మ ఫిట్ గా ఉండాలంటే ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లను ఆడకుండా దూరంగా ఉండాలని సూచించాడు.
ఐపీఎల్ కన్నా కూడా టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవడం చాలా ప్రధానం అని ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ చెప్పాడు. కాగా ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ తన స్థాయికి తగిన ఇన్నింగ్స్ ను ఆడకపోవడం గమనార్హం. మరి మధ్యలో కొన్ని మ్యాచ్ లకు దూరం అవుతాడా లేదా లాస్ట్ లో కొన్ని మ్యాచ్ లకు తప్పుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.