కేసీఆర్ కథలు..పబ్లిసిటీ పాలిటిక్స్.!

-

చేసింది గోరంత అయితే..పబ్లిసిటీ కొండత చేయించుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటైన పనే అని చెప్పాలి. ఈ రోజుల్లో రాజకీయం అంటే పబ్లిసిటీ అన్నట్లే పరిస్తితి ఉంది. ఎంత పబ్లిసిటీ చేసుకుంటే అంత మైలేజ్ అని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ అదే చేస్తున్నారు. ఈయన మొదట నుంచి ఏ అంశమైన పబ్లిసిటీకి బాగా ప్రాధాన్యత ఇస్తారు. పైగా ఇప్పుడు టి‌ఆర్‌ఎస్ పార్టీని బి‌ఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

కేంద్రంలో చక్రం తిప్పాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే వేరే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి కే‌సి‌ఆర్ ముందుకెళుతున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ ఎక్కువ సభలు పెడుతున్నారు. తాజాగా కూడా ఔరంగాబాద్ లో సభ పెట్టారు. అయితే ఈ సభలకు అవుతున్న ఖర్చు చాలానే ఉంటుందని తెలిసింది. పైగా సభలని ప్రమోట్ చేయించుకోవడానికి కే‌సి‌ఆర్..మీడియా వాళ్ళకు కూడా బాగానే ఫండ్స్ ఇస్తున్నారని తెలిసింది. తాజాగా ఓ మీడియా ఇచ్చిన కథనం ప్రకారం.. మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్‌ఎస్‌ 10 కోట్ల ప్రచార వ్యయం చేశారని తెలిసింది.

ఇక ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చే రూ.5 కోట్లు వరకు ఉంటుందని తెలిపింది. అటు సభలకు హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు చేయడానికి భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇక మండలస్థాయి పాత్రికేయులకు మర్యాదల విషయంలో కూడా ఎలాంటి లోటు చేయడం లేదట. మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు ఢిల్లీ, పంజాబ్‌ పత్రికల్లోనూ భారీగా యాడ్స్‌ ఇస్తున్నారట.

అయితే ఈ సభలకు జనం తరలింపునకు మండలాల వారీగా నేతలకు డబ్బు భారీగానే ఇస్తున్నారట. అలాగే సభ కవరేజికి వచ్చే ప్రధాన పత్రికల జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.25 వేలు, అలాగే చిన్న పత్రికల జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అంటే కే‌సి‌ఆర్ జాతీయ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news