రజినీకాంత్ కు సిగ్గు శరం లేదు – కొడాలి నాని

-

రజినీకాంత్ కు సిగ్గు శరం లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. సూపర్ స్టార్ రజనీకాంత్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే… రజినీకాంత్ ను, చంద్రబాబు రంగంలోకి దించాడు…చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలన్నారు.

ఎన్టీఆర్ పై చెప్పులు విసుగుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజినీకాంత్…. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటు అన్నారు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను…. ప్రజలేవరూ పట్టించుకోరని చురకలు అంటించారు. ఎన్టీఆర్ బతికుండగా రజిని ఏం చేశాడు…. ఇప్పుడెం మాట్లాడుతున్నాడు… మూడు రోజులు షూటింగ్ చేస్తే…. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజిని ,తెలుగు ప్రజలకేం చెప్తాడని ఆగ్రహించారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రజినీకాంత్ చదువుతూ మరింత దిగజారుతున్నాడని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news