మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టారు. శనివారం బీదర్ జిల్లాలోని హుమ్నాబద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం వచ్చాక విదేశీ పెట్టుబడులు కాంగ్రెస్ హయాంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయన్నారు.
కాంగ్రెస్ రైతులకు అన్నీ తప్పుడు హామీలు ఇచ్చిందని.. ఆ పార్టీకి పేదల కష్టం ఎప్పటికీ అర్థం కాదన్నారు మోడీ. కాంగ్రెస్ తనని దూషించిన ప్రతిసారి కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో మరోసారి బిజెపిని ప్రజలు ఆదరించాలని కోరారు. రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు అసెంబ్లీ ఎన్నికలలో సరైన బుద్ధి చెప్పాలని అన్నారు.