మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం – తలసాని

-

మౌనిక కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి తలసాని. సికింద్రాబాద్‌లో కురిసిన వర్షానికి నాలాలో పడి 11ఏళ్ల మౌనిక అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఈ ఇష్యూపై తెలంగాణ మంత్రి తలసాని స్పందించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు.. తప్పిదం ఉన్నా, స్పందించకపోయిన నిలదీయండని కోరారు.

మౌనిక కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకుంటామని ధీమా ఇచ్చారు.కళాసిగూడ ఘటన పై విచారణ కమిటీ ని ఏర్పాటు చేస్తున్నాం…కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. మౌనిక తండ్రి శ్రీనివాస్ కుటుంబం నాకు బాగా కావాల్సిన వాళ్ళు.. తప్పకుండా ఆదుకుంటామని ప్రకటించారు. జరిగిన ఘటన పై ఎంక్వైరీ వేస్తాం..5 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ప్రజలందరూ ఎలిమినేట్ చేస్తే… నువ్వు గాలికి తిరుగుతున్నావు.. ఇప్పుడేదో ఆకాశానికి ఎదిగినట్టు చెప్తున్నావ్ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు తలసాని.

 

Read more RELATED
Recommended to you

Latest news