బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో మెరవనున్న ఏకైక బాలీవుడ్ బ్యూటీ ఎవరంటే..

-

తాజాగా భారతీయ సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్అర్ సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవటంతో గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. దీపికా పదుకొనే సైతం ఈ వేడుకల్లో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

It’s confirmed: Sonam Kapoor is getting hitched this weekend - Bold ...

బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకున్నట్టు తెలుస్తోంది. లండన్ బంకింగ్ హామ్ ప్యాలెస్ లో మే 6 నుంచి 8వ తేదీ వరకు పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి. కాగా పట్టాభిషేకం అనంతరం జరగబోయే కార్యక్రమానికి హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా హజరుకానునట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సోనమ్.. అటువంటి చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానం అందడం నాకు దక్కిన గౌరవం. ఛార్లెస్‌ 3 పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ తెలిపారు.

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. పలు సినిమాల్లో నటించింది. అనంతరం పెళ్లి చేసుకుని కుటుంబంతో సహా లండన్లో స్థిరపడిపోయింది. అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ భామ ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news