అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే : మల్ రెడ్డి రాంరెడ్డి

-

అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్  మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్‌రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని అగౌరవపరిచింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే బీజేపీ నాయకులకు ఎంత ఏవగింపు ఉందో రాజ్య సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలు “అంబేద్కర్ ఫ్యాషన్ అయిండు, అంబేద్కర్ కు బదులు దేవున్ని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారు“ వింటే అర్థమవుతుంది.

Malreddy
Malreddy

హోం మంత్రి మాటల్లో అంబేడ్కర్ నామవాచికంపై వ్యంగం కనిపిస్తుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్ నామవాచకాన్ని అవమానిస్తూ పార్లమెంట్ లో మాట్లాడడం భారత జాతి మొత్తాన్ని అవమానించడమే..అంబేడ్కర్ పై గౌరవం లేదంటే దేశంలో ఉన్న ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీలపై కూడా బీజేపీ కి గౌరవం లేనట్టే. దళితులకు రాజ్యాంగం రక్షణ కవచం. అలాంటి రక్షణ కవచాన్ని తొలగించే కుట్ర జరుగుతుందని ఎన్నికల ముందే మేము స్పష్టంగా చెప్పామని తెలిపారు మల్ రెడ్డి రాంరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news