తెలంగాణ పదోతరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదల అయింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 04 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ప్రకటించింది.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, మార్చి 26న మ్యాథ్స్, మార్చి 28 ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయాలజికల్ సైన్స్, ఏప్రిల్ 02న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 03న OSSC లాంగ్వేజ్ పేపర్ 1, ఏప్రిల్ 04న OSSC లాంగ్వేజ్ పేపర్ 2 జరుగుతాయి. ఈ పరీక్షల షెడ్యూల్ లో ముఖ్యంగా ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు సెలవులు ఇచ్చారు. సెకండ్ లాంగ్వేజ్, బయాలజీ పరీక్షలకు మాత్రం ఎలాంటి సెలవు లేదు. వెంట వెంటనే జరుగనున్నాయి.