అంబేద్కర్ పేరు తీసి కేసీఆర్ సచివాలయం అని పెట్టుకోండి – బూర నర్సయ్య గౌడ్

-

తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పుడు జీఎస్టీ కలెక్షన్స్ ఎందుకు లేవని ప్రశ్నించారు మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. మహారాష్ట్రలో జీఎస్టీ కలెక్షన్ 33, వేల 196 కోట్లుగా ఉందని, కర్ణాటకలో 4,593 కోట్లు జీఎస్టీ, గుజరాత్ లో 11,700, 21 వేలకోట్ల జిఎస్టి, హర్యానా 10 వేల 35 కోట్లు, జార్ఖండ్ 3,700 కోట్లు జీఎస్టీ కలెక్షన్ వస్తుందని.. మరి తెలంగాణలో మాత్రం 5600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.

8 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. లిక్కర్ దందా కూడా ఎక్కువగానే ఉందన్నారు బూర నర్సయ్య గౌడ్. తెలంగాణలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తుందన్నారు. తెలంగాణ ప్రత్యేక దేశం అయినట్లు, కెసిఆర్ రాష్ట్రం అయినట్లు బ్రమలో ఉన్న బీఆర్ఎస్ నేతలు బయటకు రావాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ పేరు తీసి కేసీఆర్ సచివాలయం అనే పేరు పెట్టుకోవాలని చురకలంటించారు బూర నర్సయ్య గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news