కర్ణాటకలో ఈనెల 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి విస్తృతస్థాయిలో ప్రచారం చేపడుతుంది. బొమ్మై సారథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది బిజెపి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమిత్ షా, జెపి నడ్డా తో పాటు ప్రధాని మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు. ఒకరకంగా మోడీ గతంలో లేని విధంగా ఈసారి సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
నేడు కర్ణాటక హోస్పెట్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ మరోసారి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్దళ్ ని నియంత్రించాలని నిర్ణయించడం దురదృష్టకరమని అన్నారు. కర్ణాటక ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ అనేక హామీలను ఇస్తుందని.. సాధారణ ప్రజలను నమ్మకాన్ని ఆ పార్టీ ఎప్పుడో కోల్పోయిందని చెప్పారు. హామీల పేరుతో ఆ పార్టీ అబద్ధాలు మాత్రమే చెప్పగలదన్నారు మోదీ. దేశంలో నుంచి పేదరికాన్ని నిర్మూలించడంలో ఆ పార్టీ విఫలమైందని పేర్కొన్నారు.