ఏవండోయ్ ఇది విన్నారా.. మిమ్మల్నే ఓసారి వినండి.. మన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు కదా.. ఆయనకు ఇదే లాస్ట్ సీజన్ అని తెగ బాధ పడిపోయారు కదా.. అది నిజం కాదట. నిజమేనండోయ్ బాబు నేను చెప్పేది. ఆయనే స్వయంగా చెప్పారు ఈ విషయం. కావాలంటే ఇది చదవండి…
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అని వినిపిస్తున్న వార్తలన్నీ వాస్తవాలు కాదని స్వయాన అతడే హింట్ ఇచ్చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో.. స్టేడియం మొత్తం చెన్నై ఫ్యాన్స్తోనే నిండిపోయింది. గేమ్ జరుగుతోంది లక్నోలో అయినప్పటికీ.. సీఎస్కే అభిమానులే పెద్ద సంఖ్యలో మ్యాచ్కు వచ్చారు.
ఇదే విషయాన్ని టాస్ సమయంలో హోస్ట్ డానీ మోరిసన్ ప్రస్తావించాడు. “ఇదే చివరి సీజన్ కదా.. ఎలా అనిపిస్తోంది?” అని ధోనీని డానీ అడిగాడు. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ‘ఇదే చివరి ఐపీఎల్ అని మీరే డిసైడయ్యారు’ అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.
అభిమానుల్లాగే ఈ మాటను విని కంగుతిన్న డానీ.. ‘అయితే వచ్చే ఏడాది కూడా ఆడాతావన్నమాట’ అని అన్నాడు. ‘ధోనీ వచ్చే ఏడాది కూడా వస్తాడట’ అంటూ అభిమానులకు చెప్పాడు. అతని మాటలు విని ధోనీ నవ్వాడు తప్ప.. కచ్చితంగా దానికి అవును లేదా కాదు అన్న విషయాన్ని చెప్పలేదు.