షాకింగ్: లక్నో సూపర్ జెయింట్స్ కు మరో దెబ్బ

-

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కొద్ది రోజుల ముందు ఆ జట్టు కెప్టెన్ ఫిల్డింగ్ చేస్తూ కాళీ కండరాలు పట్టేయడంతో బెంచ్ కే పరిమితం అయ్యాడు. రాహుల్ లేని మ్యాచ్ నుండి ఇప్పటి వరకు ఆ జట్టు పరిస్థితి ఏమంత బాగాలేదు అని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఆ జట్టుకు చెందిన ఇంగ్లాండ్ ఓవర్సీస్ ప్లేయర్ మార్క్ వుడ్ స్వదేశానికి బయలుదేరాడు. ఇందుకు కారణం చూస్తే మార్క్ వుడ్ భార్య తాజాగా డెలివరీ అయ్యి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అందుకోసం తాను తన భార్య బిడ్డలను చూసుకోవడానికి అర్జెంటు గా పయనం అయ్యి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు.

కాగా ఆరంభ మ్యాచ్ లలో ఒంటి చేత్తో మ్యాచ్ లను గెలిపించిన ఘనత మార్క్ వుడ్ కు ఉంది. ఇప్పుడు ఈ జట్టు కష్టాల్లో ఉండగా రాహుల్ మరియు మార్క్ వుడ్ లు దూరం కావడం చాలా దారుణం అంటూ ఆజట్టు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news