ఏపీ ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 75 అన్న క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇందులో విశాఖపరిధిలోనే 25 క్యాంటీన్లు ఉండడం విశేషం. మొత్తంగా 203 కేంద్రాలను మొదలు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది.
ఈ క్యాంటీన్లలో రూ. 5కే ఉదయం ఇడ్లీ, పూరి, పొంగల్, ఉప్మా, చట్నీ, సాంబార్, మధ్యాహ్నం అన్నం, కూర, పప్పు, సాంబార్, పచ్చడి, పెరుగు అందించనున్నారు. ఈ భోజన సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది.