బరువు: ప్రెగ్నెన్సీ తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. తల్లి కూడా తనపై శ్రద్ధ పెట్టాలి అలానే పుట్టిన బిడ్డ పై శ్రద్ధ పెట్టాలి. అయితే నిజానికి తల్లి బిడ్డ మధ్య బంధం గర్భధారణ సమయంలోనే ఏర్పడుతుంది. గర్భధారణ సమయం లో తల్లి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది..? తల్లి ఆక్సిజన్ ని పొందడం, శరీరకత్వం వంటి వాటిపై బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత తల్లులు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయడం మంచిది. అప్పుడు బిడ్డ తల్లికి బాగా దగ్గర అవుతుంది. తల్లి కి బిడ్డ దగ్గరగా ఉంటే బిడ్డ మెదడులో నిర్దిష్ట భాగం ఉత్తేజ పరిచేందుకు శారీరిక భావోద్వేగ సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
కాబట్టి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ని మైంటైన్ చేయడం అవసరం. పిల్లల శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉండడం కూడా ముఖ్యం. పిల్లల శరీరం త్వరగా చల్లగా అవుతుంది పర్యావరణ ఉష్ణోగ్రతలో మార్పులు ఉన్నా కూడా ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేయడానికి అవుతుంది. తల్లి చర్మానికి బిడ్డ చర్మం దగ్గరగా ఉండాలి. తల్లి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చేయడం వలన బిడ్డ బరువు కూడా బాగుంటుంది. శరీర ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే శక్తి పెరుగుదల అభివృద్ధికి సహాయపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం వలన శిశువుతో బంధం మెరుగుపడుతుంది. ప్రోలాక్టిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.
పిల్లలతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చేయడం వలన పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి పైగా ఆరోగ్యకరమైన బరువుతో శిశువు ఉంటుంది. ఒత్తిడి హార్మోన్లు కూడా ఆ బిడ్డ తల్లి మధ్య బంధం బాగుంటే తగ్గుతాయి. కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గితే జీర్ణాసయాంతర సమస్యలు కూడా తగ్గుతాయి. పోషకాలు కూడా బాగా అందుతాయి జీర్ణం బాగా అవుతుంది. పైగా తల్లి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ని మెయింటైన్ చేస్తే పిల్లలు గాఢంగా మంచి నిద్రని పొందుతారు. పిల్లల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఇన్ని లాభాలని పొందొచ్చు.