వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్: “గోల్డ్ మెడల్” పాయె.. గాయంతో హుసాముద్దీన్ అవుట్ !

-

ప్రస్తుతం ఉజ్బేకిస్తాన్ వేదికగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. మే 1 నుండి ప్రారంభం అయిన ఈ టోర్నీ రేపటితో ముగియనుంది. కాగా ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బాక్సర్ అయిన హుసా మొహిద్దీన్ ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఎన్నో కళలు కన్నారు భారతీయులు. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అర్దాంతరంగా సెమిస్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. సెమీస్ లో ఆడుతుండగా గాయం కావడంతో టోర్నీ నుండి నిష్క్రమించాడు. దీనితో కేవలం కాంస్య పథకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మాములుగా 2022 లో ఆసియా ఛాంపియన్ షిప్ మరియు కామన్ వెల్త్ గేమ్స్ లో చేసిన ప్రదర్శనను బట్టి ఖచ్చితంగా హుసా మొహిద్దీన్ గోల్డ్ మెడల్ సాధిస్తాడు అనుకున్నాం. కానీ గాయం మన కలలకు అడ్డు వేసింది. తెలంగాణ వాసులు ఈ వార్తతో తీవ్ర నిరాశ చెందుతున్నారు, మరికొందరు అయితే బాగా ట్రై చేశావు బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news