ఐపీఎల్ 2023 : “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ మరో రికార్డ్ … !

-

ఇండియా ప్రస్తుత కెప్టెన్ మరియు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు సారధిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే టైం సరిపోదు. అవన్నీ పక్కన పెడితే తాజాగా ఐపీఎల్ సీజన్ 16 లో ఈ రోజు మ్యాచ్ లో మరో అరుదైన ఘనతను సాధించాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున 200 సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించారు. ఈ రోజు మ్యాచ్ లో గుజరాత్ తో ఆడుతోంది, టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ సేన భారీ టార్గెట్ ను గుజరాత్ ముందు ఉంచాలన్న కసిగా ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ ఆ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

 

ఇక మొత్తంగా చూస్తే రోహిత్ శర్మ ఐపీఎల్ లో కొట్టిన సిక్సర్ ల సంఖ్య 250 కి పైగానే ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ పూనకం వచినవాడిలా గుజరాత్ బౌలర్ల పై విరుచుకుపడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news