ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరిని బదిలీ చేయడానికి సమ్మతించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు ఈ విషయంలో నిషేధం ఉండగా.. ఇప్పుడు దానిని సడలిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మే 22 నుండి 31 మధ్యన ఈ బదిలీలు జరుగనున్నాయి. కాగా ఈ బదిలీలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఒకచోట రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారు రిక్వెస్ట్ చేసుకుంటే బదిలీకి అవకాశం కల్పించనున్నారు.
5 సంవత్సరాల పాటు తమ సర్వీస్ ను పూర్తి చేసిన వారికి మొదటి ప్రయారిటీ ఇచ్చే చాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2023 వరకు అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు ఇందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.