తెలంగాణాలో సంచలన విషయం ఒకటి చర్చలోకి రావడంతో వైరల్ గా మారింది. నేటి కాలంలో వరకట్నం కోసం గృహహింస కేసులు ఎక్కువగా మారాయి. ఈ హింసను తట్టుకోలేని న్దరో అమాయక గృహిణులు చావే శరణ్యం అనుకుంటూ ప్రాణాలు వదులుతున్నారు. కాగా వీటిని కొంతమేరకు అయినా ఆపాలన్న మంచి ఉద్దేశ్యంతో మానవవనరుల కేంద్రంలో సీనియర్ ఫాకల్టీ గా ఉన్న శ్రీనివాస్ ఈ విషయంపై అధ్యయనం చేసి ఒక మంచి ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఇకపై కట్నం తీసుకుంటే డిగ్రీ సర్టిఫికెట్ ను రద్దు చేసే విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాస్ ఈ ప్రతిపాదనను రాష్ట్ర మహిళా కమిషన్ కు పంపగా.. వారు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
కాగా త్వరలోనే ఈ విధానానికి సంబంధించి పూర్తి విధివిధానాలను రెడీ చేయనున్నారట. కాబట్టి ఇకపై కట్నం తీసుకునే వారు భయపడే విధంగా ఇది ఉండనుంది. కనీసం ఇలాంటి వాటితో అయినా మహిళలపై గృహహింస భారం తగ్గుతుందని ఆశిద్దాం.