అణుభూమిలో మోదీ శాంతి సందేశం.. హిరోషిమాలో గాంధీ విగ్రహావిష్కరణ

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. హిరోషిమాలో జరుగతున్న జీ7 దేశాల సదస్సుకు హాజరైన మోదీ హిరోషిమా నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత్‌-జపాన్ మధ్య స్నేహానికి గుర్తుగా భారత్‌.. గాంధీ ప్రతిమను జపాన్‌కు బహుమతిగా ఇచ్చింది. 42 అంగుళాల పొడవైన గాంధీ కాంస్య ప్రతిమను పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వంజీ సుతార్ తయారు చేశారు.

మహాత్మా గాంధీ తన జీవితాన్ని శాంతి, అహింసకు అంకితం చేశారని ఆయన సిద్ధాంతాలు, జీవితం ప్రపంచ నేతలకు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆదర్శాలు కోట్లాది మందికి బలాన్నిస్తాయని పేర్కొన్నారు. మోటోయాసు నది ఒడ్డున మహాత్మాగాంధీ ప్రతిమ కొలువుదీరిందని తెలిపారు. గాంధీ విగ్రహం ఉన్న ప్రదేశం శాంతి, అహింసకు సంఘీభావ చిహ్నంగా విరాజిల్లుతుందని మోదీ అన్నారు. నేటికీ హిరోషిమా అనే పదం వింటేనే ప్రపంచం భయపడుతోందన్న మోదీ.. ప్రపంచం వాతావరణ మార్పులు, ఉగ్రవాదంతో అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news