కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

-

కర్ణాటకలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండోసారి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సిద్ధరామయ్య చేత ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. ఎనిమిది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పరమేశ్వర, ముణియప్ప, కేజే జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జార్కిహోళి, ప్రియాంక్‌ ఖర్గే, రామ లింగారెడ్డి, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ఉన్నారు. నూతన మంత్రివర్గంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గేకు స్థానం దక్కింది.

బెంగళూరులోని కంఠీరవ మైదానంలో జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, కమల్​ హాసన్, శరద్‌పవార్‌, మొహబూబా ముఫ్తీ ఇతర నేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కంఠీరవ మైదానం కాంగ్రెస్ కార్యకర్తలతో కిటకిటలాడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news