నిన్న బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో బెంగుళూరు ను ఓడించి ఇంటికి సాగనంపింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక్కడే పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించగా, మిగిలిన జట్టు సభ్యుల నుండి సరైన సహకారం లభించలేదు. ఈ సీజన్ లో కోహ్లీ , డుప్లిసిస్ మరియు మాక్స్ వెల్ లు రాణిస్తేనే మ్యాచ్ లు గెలిచారు.. జట్టు మిడిల్ ఆర్డర్ కానీ, హిట్టర్లు కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు. RCB కీపర్ మరియు హార్డ్ హిట్టర్ అయిన దినేష్ కార్తీక్ సైతం ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శనను డక్ అవుట్ తో ముగించాడు. ఈ మ్యాచ్ లో బ్రేస్ వెల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ యాష్ దయాళ్ వేసిన మొదటి బంతికే కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఈ డక్ అవుట్ తో ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ సార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్ తో కలుపుకుని మొత్తం 17 సార్లు ఐపీఎల్ లో డక్ అవుట్ అయ్యాడు.