ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరో అతడే.. ఏకంగా రూ.200 కోట్లు..!

-

సాధారణంగా హీరోల రెమ్యునరేషన్ బడ్జెట్ పైన.. వారి క్రేజ్ పైన ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా తమ సినిమా క్రేజ్ ను బట్టి పారితోషకం పెంచుకుంటూ పోతున్నారు. ఇలా మొన్నటి వరకు ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాదు సరికొత్త రికార్డుతో మన ముందుకు వచ్చారు సౌత్ సూపర్ స్టార్ హీరో విజయ్. కోలీవుడ్ దళపతిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ సినిమాలంటే సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమే. ప్రతిసారి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించే విజయ్ తన పారితోషకం విషయంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన ఏకంగా ఈసారి వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి రూ.200 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే..ఈ ఏడాది మొదట్లో దిల్ రాజు సమర్పణలో వారసుడు సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాను విజయ్ రూ.140 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇక మరోవైపు తాను నటిస్తున్న లియో చిత్రానికి కూడా సుమారుగా రూ.180 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఇకపోతే విజయ్ నటిస్తున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ సుమారుగా రూ.250 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మరోవైపు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మినిమం రూ.100 కోట్ల గ్యారెంటీగా రాబడుతాయి.

అందుకే ప్రొడ్యూసర్లు కూడా విజయ్తో సినిమా తెరకెక్కించడానికి ..ఆయన అడిగినంత పారితోషకం ఇవ్వడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఏది ఏమైనా విజయ్ క్రేజ్ ఏకంగా రూ.200 కోట్లు రెమ్యునరేషన్ కి పెరిగిపోయింది అంటే ఇక ఆయన సినిమాలు ఎంత రేంజ్ లో తెరకెక్కుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news