60 శాతం వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీలోకి వస్తారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు మీడియాకు చెప్పలేదు కానీ.. తన సన్నిహితులతో పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. తాను MPగా పోటీ చేస్తాననే వార్తలు అసత్యమని YCP నుంచి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి MLA ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు.
TDP అధినేత చంద్రబాబు ఆదేశాలతో తాను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ…’ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండొచ్చు. అప్పటికి 60 శాతం మంది YCP నేతలు టిడిపిలో చేరుతారు. నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని’ పేర్కొన్నారు.