Japan : హీరో కార్తీ ‘జపాన్’ ఇంట్రో వచ్చేసింది

-

కంటెంట్ ఉన్న స్టోరీలతో తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటాడు కార్తీ. ఇటీవలే పొన్నియున్ సెల్వన్’, ‘సర్దార్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. పీఎస్ మిత్ర‌న్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ.. స‌ర్దార్ మూవీ స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ తో వచ్చాడు. జపాన్‌ అనే సినిమాను కార్తీ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్‌ చేయగా, తాజాగా మరో అప్డేట్‌ ను ఇచ్చారు. తమిళ హీరో కార్తీ నటించిన ‘జపాన్’ సినిమా ఇంట్రోను టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఇవాళ కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంట్రో విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, దీపావళికి జపాన్ మూవీ రిలీజ్ కానుంది. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా… సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news