తెలంగాణ విద్యార్థులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 150 ప్రభుత్వ స్కూల్ లను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మొత్తం 571 బడులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్ళు వెంటనే ప్రారంభించాలని DEO లను ఆదేశించింది.

ఫర్నిచర్, విద్యా సామాగ్రి, ఇతర ఖర్చులకు కావాల్సిన బడ్జెట్ ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది. దీంతో తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో, పార్లమెంటులో ఆడవాళ్లు భారీగా విజయం సాధించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.