తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా స్టాలిన్ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ జపాన్‌లోని బుల్లెట్ రైలు ఎక్కారు. ఆదివారం రోజున జపాన్‌లోని ఒసాకా నగరం నుంచి రాజధాని నగరం టోక్యో వరకు రైలులోనే ప్రయాణం చేసిన ఫొటోలను ఆయన షేర్ చేశారు. వేగవంతమైన ఇలాంటి బుల్లెట్ రైలు సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
‘‘ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్ రైలులో ప్రయాణం చేశా. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కి.మీల మేర ప్రయాణం సాగింది’’ అని పేర్కొంటూ తన జర్నీకి సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. డిజైన్లోనే కాకుండా వేగం, నాణ్యతలోనూ బుల్లెట్ రైలుకు సమానమైన రైల్వే సేవలు మన దేశంలో రావాలన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షిస్తూ #futureindia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
ஒசாகா நகரிலிருந்து டோக்கியோவுக்கு #BulletTrain-இல் பயணம் செய்கிறேன். ஏறத்தாழ 500 கி.மீ தூரத்தை இரண்டரை மணிநேரத்திற்குள் அடைந்துவிடுவோம்.
உருவமைப்பில் மட்டுமல்லாமல் வேகத்திலும் தரத்திலும் #BulletTrain-களுக்கு இணையான இரயில் சேவை நமது இந்தியாவிலும் பயன்பாட்டுக்கு வர வேண்டும்; ஏழை -… pic.twitter.com/bwxb7vGL8z
— M.K.Stalin (@mkstalin) May 28, 2023