RIPA scheme: కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. చాలామంది కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల తో లాభాలని పొందుతున్నారు అయితే ఆవు పేడ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆవు పేడ ఉత్పత్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది. చత్తీస్గడ్ లో ఆవుపేడ తో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం జరుగుతోంది. దీంతో రాష్ట్ర సీఎం పథకం కింద ఆవుపేడతో కూడా పెయింట్ ని తయారు చేస్తున్నారు.
బిలాస్పూర్ లోని కోట ప్రాంతంలో ఆవు పేద తో సహజ పెయింట్ ని తయారు చేస్తున్నారు ఇది పూర్తిగా సహజమైనది ఎలాంటి హాని కూడా దీని వల్ల కలగదు. మార్కెట్లో లభించే దాని కంటే కూడా ఇది చాలా చౌకగా ఉంటుంది అలానే కేంద్రం లో మహిళలు ప్లాస్టిక్ బస్తాలు కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్లు పెయింట్లని, గోనె సంచులని తయారు చేయడం ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు.
జాగృతి మహిళా స్వయం సహాయక సంఘానికి చెందిన వారు ఆవు పేడ ద్వారా పెయింట్లు తయారు చేసి 1,80,000 ఆదాయాన్ని పొందారు దీంతో 45000 ప్రయోజనాన్ని కూడా పొందారు. ఇప్పటివరకు 780 లీటర్ల పెయింట్ ని విక్రయించారు. 7000 లీటర్లు ఆర్డర్ వచ్చింది ఇక్కడ తయారవుతున్న బస్తాలని మొదలైన వాటిని చాలా ప్రాంతాల వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం అందరికీ ఎంతో బాగా ఉపయోగ పడుతోంది. చక్కగా లాభాలని పొందుతున్నారు. త్వరలో అగర్బత్తిల తయారీ పనులను కూడా మొదలుపెట్టబోతున్నారు.